సినిమాలు, షూటింగ్‌లు, రియాలిటీ షోలతో విరామం లేకుండా గడుపుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ కోసం ప్రపంచమంతా చక్కర్లు కొట్టాడు ఎన్టీఆర్. దీంతో కుటుంబానికి కూడా దూరం కావాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావడంతో ఆయన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లారు. శనివారం ఎన్టీఆర్ కుటుంబం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వెళ్లారు. తొలి రోజు ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద కొడుకు అభయ్ రామ్‌ని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ‘కనులకు విందైన ఈఫిల్ టవర్’ అంటూ పోస్ట్ చేశారు ఎన్టీఆర్.
నిన్న అక్కడే ట్రైన్‌లో వెళ్తూ తన చిన్న కొడుకు భార్గవ్ రామ్‌ని ముద్దుపెట్టుకుంటూ ఉన్న ఫోటోని షేర్ చేసి ‘నాకు చాలా చెప్పాలని ఉంది కానీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఈ ఫొటోతో పాటు భార్య ప్రణతి, భార్గవ్ రామ్‌లు ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ , రామ్‌చరణ్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటోంది.
ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ , పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్, చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
1
2
3
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!