నాన్నకు ప్రేమతో సినిమాతో యాభై కోట్ల క్లబ్ లో చేరిన జూనియర్ ఎన్టీఆర్.తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్సకత్వం లో జనతాగ్యారేజ్ అనే మూవీ ని ఫిక్స్ చేసాడు.ఐతే కెరియర్ ఆరభంలోనే మాస్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన జూనియర్ ఇప్పుడు క్లాస్ చిత్రాల మీద దృష్టి పెట్టాడు. ఇదిలా ఉంటె ఫ్యాన్స్ మాత్రం ఆందోళనలో ఉన్నారు.దీనికి కారణం ఏమిటంటే రీసెంట్ గా నాన్నకు ప్రేమతో చిత్రం ఫలితం మళ్లీ రిపీట్ ఆవుతుందేమో అని భావిస్తున్నారు. కొరటాల శివ మాస్,క్లాస్ పల్స్ బాగా తెల్సిన దర్శకుడు కావడంతో జనతాగ్యారేజ్ ని చక్కగా తెరకేక్కిస్తాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.