ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ హీరోయిన్ ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘నిన్ను చూడాలని’. నిజానికి ఎన్టీఆర్ మొదటి చిత్రంగా ‘స్టూడెంట్ నెంబర్ 1’ ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యం అవ్వడంతో ‘నిన్ను చూడాలని’ చిత్రం ముందుగా రిలీజ్ అయ్యింది.2000 వ సంవత్సరంలో నాగార్జునతో ‘నువ్వు వస్తావని’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. నందమూరి ఫ్యామిలీకి ఇతను దూరపు బంధువు కూడా..!

‘నువ్వు వస్తావని’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కూడా కాబట్టి.. ఎన్టీఆర్ డెబ్యూ మూవీకి దర్శకుడిగా ఇతన్ని సెలెక్ట్ చేశారు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రవీనా రాజ్ పుత్.. ఎక్కువ మందికి గుర్తుండకపోవచ్చు. తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించింది లేదు.అయితే అంతకు ముందు వెంకటేష్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఒంటరి పోరాటం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె నటించింది.

అయితే ‘నిన్ను చూడాలని’ వంటి పెద్ద అవకాశం వచ్చినా ఈమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.కొన్నాళ్ల తర్వాత బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్ మెన్ ను పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ ఫోటోలో గుర్తుపట్టలేని విధంగా ఉందామె.!

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus