Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ స్టూడియోలో పెట్టుబడులు పెడుతున్నారా?

  • May 16, 2023 / 08:03 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలు, టీవీ షోలు, యాడ్స్ ఆఫర్లతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కోరితే ఎంత మొత్తమైనా పారితోషికం ఇవ్వడానికి ప్రముఖ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఎన్టీఆర్ దిల్ రాజు కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కనుందని రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. అయితే శంషాబాద్ లోని ఒక స్టూడియోలో తారక్ భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు అక్కడ స్టూడియో నిర్మిస్తున్నారని నందమూరి హరి ఆ స్టూడియోకు సంబంధించి భాగం అయ్యారని సమాచారం అందుతోంది. ఈ స్టూడియోలో ఎన్టీఆర్30 షూట్ జరగడంతో తారక్ ఈ స్టూడియోలో పెట్టుబడులు పెట్టారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ మారుతి కాంబో మూవీ షూట్ కూడా ఈ స్టూడియోలోనే జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్నో ప్రత్యేకతలతో ఈ మోషన్ క్యాప్చర్ స్టూడియోను బిల్డ్ చేశారని పాన్ ఇండియా సినిమాలకు ఈ స్టూడియో బెస్ట్ ఆప్షన్ అవుతోందని తెలుస్తోంది. తారక్ పెట్టుబడులు పెట్టినట్టు జరిగిన ప్రచారం వల్ల ఈ స్టూడియో పేరు ఇండస్ట్రీ వర్గాల్లో మరింత ఎక్కువగా వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా తారక్ పుట్టినరోజున ప్రేక్షకులకు ఎన్నో సర్ప్రైజ్ లు ఉండనున్నాయని తెలుస్తోంది.

ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు కోరుకున్న సినిమాలలో నటించాలని భావిస్తున్నారని బోగట్టా. సినిమా సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో తారక్ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల ప్రకటన దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus