Jr NTR: ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఆ ఘనత సాధించిన తొలి హీరో ఎన్టీఆర్..!

  • January 5, 2023 / 12:00 PM IST

ఎన్టీఆర్ పేరు ఆస్కార్ లిస్ట్ లో చేరిందనే వార్త ఇప్పటికే అందరికీ తెలిసింది.ఆగస్టులోనే అమెరికాకు చెందిన ‘వెరైటీ’ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు మరో శుభవార్త కూడా చెప్పింది ఆ సంస్థ. విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో దూసుకుపోతున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. బెస్ట్ యాక్టర్ ప్రెడిక్షన్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ టాప్ 10 లో నిలిచాడట. ఇది నిజంగా గొప్ప విషయమే! ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ నటుడు

ఇలా ఆస్కార్ ప్రెడిక్షన్స్ లిస్ట్ లో టాప్ 10 లో నిలవడం ఇదే మొదటిసారి. ఫైనల్ గా ఎన్టీఆర్ కు ఆస్కార్ లభిస్తుందా లేదా అన్నది తర్వాతి సంగతి.ఈ ఒక్క విషయంతో తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లికింపతగినది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో కొమరం భీమ్ గా అద్భుతంగా నటించినందుకు గాను ఎన్టీఆర్ కు ఈ సువర్ణావకాశం లభించింది. కొమరం భీముడొ అనే పాటలో ఎన్టీఆర్ పలికించిన హవ భావాలు..

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రపంచంలోని ప్రముఖ మూవీ పబ్లికేషన్స్ అయిన అమెరికాకి చెందిన ‘VARIETY’ వారు ఆస్కార్ -2023 కి గాను ఉత్తమ నటుడు కేటగిరీలో పోటీగా ఉన్న నటుల పేర్లను ఆగస్టులో ప్రచురించగా.. ఆ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఉన్నట్లు స్పష్టంచేసింది.

ఇప్పుడైతే టాప్ 10లో ఉన్నాడు అని మరో గొప్ప గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘నాటు నాటు’, ‘కొమరం భీముడొ’ సాంగ్స్ టాప్ 5 లో స్థానం దక్కించుకున్నట్టు కూడా ఈ సంస్థ వెల్లడించింది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus