Jr NTR: తారక్ లుక్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ పాత్ర కోసం తారక్ బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో తారక్ సాధారణ లుక్ లో కనిపించారు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో కొరటాల శివ సినిమా కొరకు 8 కిలోల బరువు తగ్గనున్నట్టు తారక్ ప్రకటించారు. అయితే తారక్ కేవలం 20 రోజుల్లోనే బరువు తగ్గి ప్రేక్షకులను ఫిదా చేశారు.

Click Here To Watch NOW

తారక్ స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తారక్ స్లిమ్ లుక్ లో అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మోస్ట్ డెడికేటెడ్ హీరోలలో ఒకరైన తారక్ సినిమాకు అనుగుణంగా తనను తాను మలచుకుంటూ ఉండటం గమనార్హం. తారక్ ఈ సినిమాలో స్టూడెంట్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ కోసం అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.

కొరటాల శివ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో అలియా భట్ ను ఈ పాత్రకు ఎంపిక చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకోనుందని సమాచారం అందుతోంది. అలియా భట్ తాజాగా ఒక హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హాలీవుడ్ మూవీకి బల్క్ డేట్లు కేటాయించాల్సి రావడంతో అలియా భట్ ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

అయితే చిత్రయూనిట్ నుంచి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అలియా భట్ ఈ సినిమాకు దూరమైతే ఈ సినిమాలో మరో బాలీవుడ్ హిరోయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus