Jr NTR: వార్2 మూవీకి తారక్ భారీ రెమ్యునరేషన్.. ఏకంగా అంత తీసుకుంటున్నారా?

  • September 7, 2023 / 12:49 PM IST

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కాంబినేషన్ లో వార్2 సినిమా తెరకెక్కుతుండగా 2025 సంవత్సరం జనవరి నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వార్2 సినిమాకు తారక్ పారితోషికం 100 కోట్ల రూపాయలు అని మొదట ప్రచారం జరగగా ఆ తర్వాత 30 కోట్ల రూపాయలు అని వినిపించింది.

అయితే తారక్ అసలు పారితోషికం లెక్కలు మాత్రం వేరే ఉన్నాయని తెలుస్తోంది. తారక్ ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో ఛాలెంజింగ్ రోల్ లో తారక్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. వార్2 సినిమాతో బాలీవుడ్ లో తన మార్కెట్ మరింత పెరుగుతుందని తారక్ ఫీలవుతున్నారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఫ్రాంఛైజీగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. వార్2 సినిమాకు సీక్వెల్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. భవిష్యత్తులో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తారక్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తారక్ స్పందిస్తే భవిష్యత్తు సినిమాల గురించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న యంగ్ టైగర్ (Jr NTR) జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుని ఆ సక్సెస్ రేట్ ను మరింత పెంచుకోవాలని ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో మరిన్ని క్రేజీ, భారీ ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో తారక్ ఒకరిగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus