Jr NTR: ఎన్టీఆర్30 సక్సెస్ కావాలని తారక్ షాకింగ్ నిర్ణయం?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా విషయంలో ఫ్యాన్స్ లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే తారక్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్టాఫ్ లాక్ అయిందని సెకండాఫ్ కథ విషయంలో మాత్రం తారక్ పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడం లేదని సమాచారం అందుతోంది. ఈ సినిమా కథాచర్చల్లో తారక్ కూడా పాల్గొంటున్నారని సినిమా సక్సెస్ సాధించాలనే ఆలోచనతో తారక్ కూడా కొన్ని సూచనలను ఇస్తున్నారని తెలుస్తోంది.

తారక్ ఈ విధంగా కథా చర్చల్లో పాల్గొని సూచనలు చేయడం తొలిసారి ఈ సినిమా విషయంలోనే జరుగుతోంది. ఎన్టీఆర్30 సక్సెస్ కావాలనే ఆలోచనతో తారక్ ఈ సినిమా విషయంలో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొరటాల శివ తారక్ స్నేహితుడు కావడంతో కొంచెం ఆలస్యమైనా ఈ సినిమాతోనే ముందుకు వెళ్లాలని తారక్ భావిస్తున్నారు. 2023 సంవత్సరంలో తారక్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమా షూట్ పూర్తి కానుందని బోగట్టా. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.

సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతుండగా తారక్ కొత్త ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జై లవకుశ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్ మరో నిర్మాతగా ఉన్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus