“పక్కా…లోకల్”లో ఎన్టీఆర్ పాట!!!

  • September 13, 2016 / 01:26 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్….మనం కాస్త పక్కాగా మాట్లాడుకుంటే…..దాదాపుగా మన టాలీవుడ్ లో అన్నీ రకాలుగా టాలెంట్ ఉన్న హీరో ఎవరైన ఉన్నారా అంటే….అందులో ఎన్టీఆర్ పేరు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే…..యాక్టింగ్….డ్యాన్స్…మారామే కాదు….ఎన్టీఆర్ మంచి పాటగాడు కూడా….ఒకటా రెండా…యమదొంగ సినిమాలో….ఓలమ్మీ తిక్క రేగిందా అంటూ…ఇరగదీసినా….ఆ తర్వాత 123 నేనొక కంత్రి అంటూ మాస్ టైటిల్ సాంగ్ ని సింగినప్పుడు…..రాకాసి రాకాసి అంటూ తన వాయ్స్ లోని జోష్ ని ఫ్యాన్స్ కి వినిపించినప్పుడు…ఐ వానా ఫాలో ఫాలో యూ అంటూ…డ్యాన్స్ తో మాత్రమే కాకుండా….తన గొంతు తో మెస్‌మెరైజ్ చేసినప్పుడు….

ఇంకా చెప్పాలి అంటే….కన్నడలో “గెలయా గెలయా” అంటూ దుమ్ము దులిపేసినప్పుడు ఎన్టీఆర్ ను అందరూ మెచ్చుకున్నారు…అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ ఇప్పుడు నాని సినిమాలో కూడా ఒక పాట పడేందుకు రెడీ అయిపోతున్నాడు….ఇంతకీ ఏంటి ఆ సినిమా…ఏమీ ఆ కధ అంటే….మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే…నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘పక్కా లోకల్’ కోసం యంగ్ టైగర్ గొంతు కలపనున్నాడు…‘సినిమా చూపిస్త మావ’తో సక్సెస్ అందుకున్న త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ‘పక్కా లోకల్’లో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తూ ఉండగా….ఈ సినిమాకి తొలిసారి…దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

అయితే దేవిశ్రీతో ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉండడంతో.. నానితో ఉన్న స్నేహం సైతం కలసి రావడంతో… ఇక దిల్ రాజు కూడా ఎన్టీఆర్ కు సన్నిహితుడే అవడం అన్నీ కలగలిపి….ఒక పాట పాడమని వాళ్ళు అడగగానే కాదనలేకపోయాడట ఎన్టీఆర్. మరి ఇంకేంటి…ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తెలిస్తే…..కెవ్వు కేకే….

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus