Jr NTR: సైలెంట్ గానే ఆ పని చేయబోతున్న తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. దర్శకుల ఎంపికలో, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ తారక్ వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా తారక్ మాత్రం నిదానంగా సినిమాలు చేయడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

ఫ్యాన్స్ అసంతృప్తి గురించి తారక్ కు తెలిసి తారక్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని బోగట్టా. గత కొన్నేళ్లుగా ఒకే సమయంలో ఒక సినిమాలో మాత్రమే నటిస్తున్న తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒకే సమయంలో నటించనున్నారని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నెలలో ఆచార్య రిలీజ్ ఉండటంతో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో మూవీ ఆలస్యమైంది.

ఎన్టీఆర్ సినిమాను వేగంగా పూర్తి చేయాలని కొరటాల శివ సైతం భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ ఒక సినిమాలో నటించాల్సి ఉన్నా సలార్ రెండు భాగాలుగా తెరకెక్కితే మాత్రం ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుంది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో తారక్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ చేరడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

550 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా రిలీజైన తర్వాత ఈ సినిమా ఏకంగా 2,000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటూ వరుసగా సినిమాల్లో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus