Lakshmi Pranathi: లక్ష్మీ దేవిలా మెరిసిపోతున్న ఎన్టీఆర్ భార్య.. లేటెస్ట్ పిక్ వైరల్..!

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి అందరికీ సుపరిచితమే.ఎన్టీఆర్ కు ఖాళీ టైం దొరికితే ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటాడు. ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా లక్ష్మీ ప్రణతి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది. ఆ వేడుకలో ఈమె ట్రెడిషనల్ దుస్తుల్లో.. ఒంటి నిండా నగలతో ఓ దేవత మాదిరి కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే నెటిజన్లు కూడా ‘సాక్షాత్తు లక్ష్మి దేవి లానే ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇద్దరి పిల్లలకు తల్లయినప్పటికీ ఈమె 20 ఏళ్ళ అమ్మాయిలానే కనిపిస్తుంది. ఆమె ధరించిన చీర ధర రూ.3 లక్షల పైనే ఉంటుందని అంచనా. మొన్నామధ్య లక్ష్మీ ప్రణతితో కలిసి లాన్‌లో కాఫీ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటున్నట్టు ఓ ఫోటోని ఎన్టీఆర్ షేర్ చేశాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో ఎన్టీఆర్ ఎక్కువగా తన భార్య గురించి చెప్పుకొచ్చేవాడు.పెళ్ళికి ముందు ‘నేను నచ్చానా’ అని నా భార్యను చాలా సార్లు అడిగేవాడిని.

అందుకు ఆమె ‘యెస్’ అని కానీ ‘నొ’ అని కానీ చెప్పేది కాదు’ అంటూ చెప్పి సరదాగా కామెంట్స్ చేసేవాడు ఎన్టీఆర్. ఇదిలా ఉండగా.. లక్ష్మి ప్రణతికి సోషల్ మీడియా వంటి వాటిలో ఖాతాలు లేవు. ఆమె సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. మహేష్ బాబు భార్య నమ్రత, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసన… వీళ్లంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం ఆ హంగులకు దూరంగా ఉంటూ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంటుంది.

1

2

3

4

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus