Jr Soundarya: జూనియర్ సౌందర్య వీడియోలు వైరల్.. ఈమె ఎవరంటే?

  • November 2, 2021 / 11:13 PM IST

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. మనం కొన్నిసార్లు కొత్త వ్యక్తులను కలిసిన సమయంలో వీళ్లను ఎక్కడో చూశామనే భావన కలుగుతూ ఉంటుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, స్టార్ క్రికెటర్ల పోలికలతో ఉన్న వ్యక్తుల ఫోటోలు, వీడియోలు గతంలో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ సౌందర్య ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దివంగత నటి సౌందర్య కన్నడ అమ్మాయి అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

మనవరాలి పెళ్లి అనే మూవీతో సౌందర్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా సౌందర్య గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తక్కువ సమయంలోనే 100కు పైగా సినిమాలలో నటించారు. ఒకవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు చిన్న హీరోలతో కూడా సౌందర్య నటించారు. నటి సౌందర్య చిన్న వయస్సులోనే విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సౌందర్య పోలికలతో ఉన్న ఒక అమ్మాయి నెట్టింట హల్చల్ చేస్తోంది.

Chitra_jii2 అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో ఉన్న వీడియోలను చూసి నెటిజన్లు ఆ యువతి అచ్చం సౌందర్యలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది సౌందర్య మళ్లీ పుట్టిందని కామెంట్లు చేస్తుండగా సౌందర్య పోలికలతో ఉన్న యువతిని చూసి కొందరు నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జూనియర్ సౌందర్య పేరు చిత్ర కాగా ఈమెకు సోషల్ మీడియాలో 77,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus