Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 18, 2026 / 04:12 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వర్ధన్ గుర్రాల (Hero)
  • కృష్ణ ప్రియా (Heroine)
  • సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్ రాజులపాటి తదితరులు (Cast)
  • ఎం జి ఆర్ తుకారాం (Director)
  • కీర్తన నరేష్, టి ఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప  (Producer)
  • ఏ ఐ ఎస్ నోఫాల్ రాజా (Music)
  • రుద్ర సాయి (Cinematography)
  • జెస్విన్ ప్రభు (Editor)
  • Release Date : 18th సెప్టెంబర్ 2026
  • ఎస్ ఎల్ ఎన్ సినీ క్రియేషన్స్, ప్రాణాది క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ (Banner)

ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోవడం వల్ల.. చిన్న సినిమాలకి మంచి స్పేస్ దొరికినట్టు అయ్యింది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రిలీజ్ కి ముందు సినిమాపై మినిమమ్ బజ్ అయినా ఉండాలి. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాల్లో ‘కాగితం పడవలు’ ఒకటి. ఈ సినిమాపై బజ్ అయితే లేదు. మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బాక్సాఫీస్ వద్ద సందడి చేసే కంటెంట్ ఇందులో ఉందో లేదో తెలుసుకుందాం రండి:

Kaagitham Padavalu Movie Review

Kaagitham Padavalu Movie Review Rating

కథ: రామ్ (వర్ధన్ గుర్రాల) పిట్లం అనే ఊరికి చెందిన అబ్బాయి. గోదావరి (కృష్ణప్రియా) వడ్లం అనే ఊరికి చెందిన అమ్మాయి. వీరి ఊర్లు మాత్రమే కాదు, కులాలు కూడా వేరు. రామ్ తండ్రి పిట్లం ఊరి పెద్ద, అలాగే గోదావరి తండ్రి వడ్లం ఊరి పెద్ద. ఈ రెండు ఊర్ల మధ్య కుల ఘర్షణలు ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే రామ్, గోదావరి చిన్నప్పటి నుంచీ ఒకరినొకరు ఇష్టపడతారు. వీరిలాగే వీరి స్నేహితులైన రాజేష్, స్వప్న కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఒకరోజు రాజేష్, స్వప్న ఏకాంతంగా ఉన్నప్పుడు స్వప్న ఊరి జనాల కంట పడతారు. వెంటనే రాజేష్‌ను పట్టుకుని చావగొడతారు.

అంతేకాదు, మరుసటి రోజు పంచాయితీలో ఊరి పెద్దలు వీరిద్దరినీ కఠినంగా శిక్షిస్తారు. ఆ అవమానంతో వీరి తల్లిదండ్రులు కూడా వాళ్లను చిత్రహింసలకు గురిచేస్తారు. ఆ బాధ భరించలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోతారు.ఈ దారుణాన్ని కళ్లారా చూసిన రామ్, గోదావరి తీవ్ర భయాందోళనలకు గురవుతారు. తమ పరిస్థితి కూడా రాజేష్, స్వప్నల మాదిరి తయారవుతుందేమోనని భయపడతారు. వారు భయపడినట్లుగానే పెద్దలకు వీరి ప్రేమ విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత వీరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే మిగిలిన కథ.

Kaagitham Padavalu Movie Review Rating

న‌టీన‌టుల ప‌నితీరు: ఒక్క సమ్మెట గాంధీ తప్ప మిగిలిన వారంతా ఆల్మోస్ట్ జనాలకి కొత్తే అని చెప్పాలి. వర్ధన్ గుర్రాల గతంలో ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అయినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే ఈ సినిమాలో అతని లుక్స్ బాగున్నాయి. నటనలో కూడా ఈజ్ ఉంది. హీరోగా ఏమో కానీ సరైన పాత్ర పడితే మంచి ఆర్టిస్ట్ గా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ కృష్ణప్రియా లుక్స్ బాగానే ఉన్నాయి. పెర్ఫార్మన్స్ మాత్రం అంతంత మాత్రమే. మిగిలిన నటుల్లో సమ్మెట గాంధీ పర్వాలేదు అనిపించాడు. ప్రేమ్ సాగర్ రాజులపాటి మాత్రం బాగా చేశాడు. మిగతా నటీనటుల పాత్రలు అంతగా రిజిస్టర్ కావు.

Kaagitham Padavalu Movie Review Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: గతంలో  పరువు హత్యల బ్యాక్ డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. ‘ప్రేమిస్తే’, ‘గౌరవం’, ‘దొరసాని’, ‘కలర్ ఫోటో’, ‘ఉప్పెన’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తమిళ దర్శకుడు భారతీరాజా అయితే ఈ పాయింట్‌తో ఎన్నో సినిమాలు తీశారు. వీటిలో చాలావరకు హిట్ అయ్యాయి, మరికొన్ని క్రిటికల్లీ అక్లెయిమ్డ్ అనిపించుకున్నాయి. అవన్నీ పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం, వాటి స్క్రీన్‌ప్లే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉండటమే. యువతను సైతం ఆలోచింపజేయడంలో ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయి. కానీ, ఈ ‘కాగితం పడవలు’ సినిమా విషయానికి వచ్చేసరికి మొదటి నుంచీ స్క్రీన్‌ప్లే మైనస్‌గా మారింది.

హీరో హీరోయిన్ల చైల్డ్ ట్రాక్, ఫస్ట్ హాఫ్‌లో బ్యాక్ టు బ్యాక్ వచ్చే సాంగ్స్ బోర్ కొట్టిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోగా.. నీరసం తెప్పిస్తుంది. సెకండాఫ్ కూడా భారంగానే మొదలై, నెమ్మదిగా సాగుతుంది. హీరోయిన్ ఊర్లో జనాలు రాత్రిపూట హీరో ఫ్రెండ్స్‌ను పరుగులు పెట్టించే సన్నివేశం ఒకటి ఉంటుంది. సినిమా మొత్తంలో ఆ ఒక్క సన్నివేశమే బాగుంటుంది. దాన్ని బాగా పిక్చరైజ్ చేశారు. ఇక క్లైమాక్స్ అంతా ఫోర్స్డ్‌గానే ఉంటుంది. సమ్మెట గాంధీ పాత్రతో మెసేజ్ ఇప్పించే ప్రయత్నం చేశారు, కానీ అది కూడా ప్రేక్షకులను రంజింపజేయలేదు. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. వాటిని కవర్ చేసేందుకు టెక్నికల్ టీమ్ బాగా కష్టపడింది.

Kaagitham Padavalu Movie Review Rating

విశ్లేషణ: ‘కాగితం పడవలు’ యువతని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమానే అయినప్పటికీ వారిని ఆకట్టుకునేలా కథనం లేకపోవడంతో ఇది వృధా ప్రయత్నం అనే చెప్పాలి.

Kaagitham Padavalu Movie Review Rating

ఫోకస్ పాయింట్: ‘కాగితం పడవలు’.. వరదల్లో కష్టం

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaagitham Padavalu Movie
  • #Krishna Priya
  • #MGR Thukaram
  • #Vardhan Gurrala

Reviews

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

13 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

23 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

14 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

16 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

17 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

19 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version