కీరవాణి చిన్న కుమారుడు, ప్రముఖ సింగర్ అయినటువంటి కాలభైరవ(Kaala Bhairava), హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇప్పటివరకు అధికారికంగా వెంటనే కన్ఫర్మ్ చేసింది లేదు. మొత్తానికి ఈరోజు సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్షిప్ వ్యవహారాన్ని బయటపెట్టరు. కావ్యపై తనకున్న అంతులేని ప్రేమను కాలభైరవ తన ఇన్స్టాగ్రామ్లో అందమైన పదాలతో రివీల్ చేశాడు.
‘కావ్యతో గడిపే ప్రతి క్షణం కొండల మధ్య ప్రవహించే జలపాతాన్ని చూసినంత ప్రశాంతంగా ఉంటుందని, ఆమెతో తన సంభాషణలు చలికాలం ఉదయాన్నే ఇష్టమైన వేడి కాఫీ తాగినంత హాయినిస్తాయని రాసుకొచ్చాడు. ఇన్నాళ్లూ తనలోని ఆ ఆనందానికి పేరు దొరకలేదని, కానీ ఆ సురక్షితమైన భావనే ‘హోమ్’ (సొంత ఇల్లు) అని ఇప్పుడు అర్థమైందంటూ తనలో ఉన్న ప్రేమికుడి బాధని వివరించాడు. కావ్యాని కలిసినప్పుడు కొత్త వ్యక్తిని కలిసినట్టు లేదని, సొంత ఇంటికి చేరుకున్నట్టు అనిపించిందని, జీవితకాలం పాటు తమ బంధం ఇలాగే కొనసాగుతుందని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశాడు కాలభైరవ.
మరోవైపు కావ్య కళ్యాణ్ రామ్ సైతం కాలభైరవను పై ఉన్న ప్రేమని బయటపెట్టింది. ‘ఎల్లో పేపర్ డైసీ’ అంటూ అతన్ని ముద్దుగా ప్రస్తావించింది. అతను తన జీవితంలోకి రావడం అనేది దేవుడి బ్లెస్సింగ్ అని, ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తన సాదాసీదా రోజుల్లో వెలుగులు నింపినందుకు కాలభైరవకి కృతజ్ఞతలు తెలిపింది.తన మనసులోని చిన్న కోరికలను సైతం అర్థం చేసుకునే బెస్ట్ పార్టనర్ దొరికాడని కావ్య తెలిపింది.
వీరి పోస్టులకి ఆనందం వ్యక్తం చేస్తూ నిహారిక కొణిదెల, ఈషా రెబ్బా వంటి వారు బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూ కామెంట్లు పెట్టారు.