Kajal: కాజల్ కు మగబిడ్డ వైరల్ అవుతున్న న్యూస్..!

  • April 19, 2022 / 06:12 PM IST

కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తాజా సమాచారం. అయితే ఈ విషయం పై కాజల్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇంకా స్పందించలేదు. బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. అయినప్పటికీ దీనిని కాజల్ కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. అలా అని అబద్దమని రియాక్ట్ అయ్యింది కూడా లేదు. ఇదిలా ఉండగా..కాజల్ ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించింది కూడా జనవరిలోనే..! ఎన్నో రూమర్స్ నడుమ ఆమె తన ప్రెగ్నెన్సీ మేటర్ ను బయటపెట్టింది.

Click Here To Watch NOW

అయితే ‘ఘోస్ట్’ మూవీ నిర్మాతలు ఈ విషయాన్ని ‘లక్ష్య’ సినిమా ప్రమోషన్ల టైములో అంటే డిసెంబర్ లో రివీల్ చేశారు. అప్పటికే కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు మొదలై రెండు నెలలు కావస్తోంది. కాబట్టి.. కాజల్ కు డెలివరీ అయినట్టు వస్తున్న వార్తల్లో నిజాలు ఉండే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఈ విషయం పై ఆమె తరుపున అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రెగ్నెన్సీ టైంలో కాజల్ బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొంది.

వాటి పై తనదైన శైలిలో స్పందించి లైట్ తీసుకుంది. తర్వాత తన ఇన్స్టాగ్రామ్ లో సమయం దొరికినప్పుడల్లా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసేది. అంతేకాదు కొన్ని వర్కౌట్లు కూడా చేసేది. ఫ్రీ డెలివరీ కోసం అలాంటి వర్కౌట్లు హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్నట్టు ఆమె సన్నిహితులు తెలియజేసారు. అలాగే గర్భిణీ యువతులకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ను కూడా ఆమె ప్రమోట్ చేస్తూ వచ్చింది. మొన్నటికి మొన్న తన భర్త కేరింగ్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసిస్తూ ఈమె చేసిన కామెంట్స్ పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus