కలవరపెడుతున్న కాజల్ ముద్దులు!

  • May 23, 2016 / 01:10 PM IST

ఈమధ్యకాలంలో హీరోయిన్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించేయడం, రెచ్చిపోయి మరీ ఆధార చుంబనాల సన్నివేశాల్లో జీవించేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. సమంత, రకుల్ వంటి టాప్ హీరోయిన్లు కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా మూతి ముద్దులు (లిప్ లాక్)లు ఇచ్చేస్తుంటే.. వీళ్ళకంటే సీనియర్ అయిన కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటివరకూ వాటికి (లిప్ లాక్స్) దూరంగా ఉంటూ వచ్చింది.

“ఆర్య 2, బ్రదర్స్, బిజినెస్ మ్యాన్” వంటి సినిమాల్లో సదరు సినిమాల హీరోలతో లిప్ లాక్స్ చేసినప్పటికీ.. అవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్. మొదటిసారిగా “దో లఫ్జోంకి కహానీ” సినిమా కోసం రణదీప్ హుడాతో ఓ సూపర్ లిప్ లాక్ సీన్ లో నటించింది. ఇటీవల విడుదలైన ఓ పాట ద్వారా సదరు లిప్ లాక్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాల్ హల్ చల్ చేయడం మొదలెట్టింది. అలాగే.. “బ్రహ్మోత్సవం”లోనూ మహేష్ పెదవులు కూడా తడిపేసింది.

తనకు పోటీ ఇస్తున్న నవతరం హీరోయిన్లకు తానేమీ తక్కువ కాను అని చెప్పుకోవడానికో లేక కెరీర్ ను మరికొంత కాలం నిలబెట్టుకోవడం కోసమే తెలియదు కానీ.. కాజల్ ముద్దులు మాత్రం ఆమె అభిమానులను మాత్రమే కాకుండా ఆమెకు నిన్నటివరకూ గట్టి కాంపిటీషన్ ఇచ్చిన హీరోయిన్లను సైతం కలవపెడుతున్నాయి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus