మళ్ళీ బిజీ అవ్వడం కోసం గ్లామర్ డోస్ పెంచేస్తున్న కాజల్

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న కాజల్ ఇప్పుడు కాస్త డల్ అయ్యిందనే చెప్పాలి. కుర్ర హీరోయిన్ల పోటీ ఎక్కువ అవ్వడంతో ఈమెకు అవకాశాలు ఆశించిన స్థాయిలో రావట్లేదు. అందులోనూ ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్లో చెబుతుండడంతో దర్శక నిర్మాతలు కాజల్ కు మొహం చాటేస్తున్నారు. అయితే కుర్ర హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోలు మాత్రం ఈమెతో నటించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్.. ‘కవచం’ ‘సీత’ అంటూ ఈమెతో రెండు సినిమాలు చేసాడు. ఇక ప్రస్తుతం శర్వానంద్ తో కూడా ‘రణరంగం’ సినిమా చేస్తుంది.

దీంతో పాటు తమిళంలో ‘కోమాలి’ అనే చిత్రం చేస్తుంది. ‘జయం’ రవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదలవుతుంది. ఈ చిత్రంలో కాజల్ చాలా హాట్ హాట్ గా కనిపిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని స్టిల్స్ చూస్తుంటే.. ఆ డౌట్ రాక తప్పదు. ప్రస్తుతం ‘కోమాలి’ చిత్రంలోని హాట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ‘కోమాలి చిత్రంలో కావాల్సినంత రొమాన్స్‌ ఉంటుందని ‘ హీరో ‘జయం’ రవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. తమిళంలో మళ్ళీ బిజీ అవ్వడం కోసమే కాజల్ ఇలా గ్లామర్ షో చేస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus