కాజల్ అగర్వాల్ నటనకు గుడ్ బై చెబుతున్నారట. ఆమె ఇక సినిమాల్లో నటించరట. ఇందుకు బలమైన కారణం ఉందట. కాజల్ రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉంది. లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్ గా మారిన కాజల్ ని చందమామ, మగధీర చిత్రాలు స్టార్ చేశాయి. ఇన్నేళ్ల కెరీర్లో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విరివిగా చిత్రాలు చేశారు. ముఖ్యంగా తెలుగులో తిరుగులేని స్టార్డమ్ అనుభవించారు. రెండు తరాల టాప్ స్టార్స్ తో ఆమె నటించారు.
సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా సుదీర్గకాలం పాటు చక్రం తిప్పిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి హడావుడి లేకుండా సడెన్ గా తన చిన్ననాటి స్నేహితుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే గౌతమ్ కిచ్లూతో కరోనా సమయంలో ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ప్రెగ్నెంట్ అయిన కాజల్..
గత ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. (Kajal) కాజల్-గౌతమ్ కిచ్లూ దంపతులు తమ ముద్దుల తనయుడికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం కాజల్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరలవుతోంది. అదేంటంటే.. ఈ అమ్మడు రెండోసారి ప్రెగ్నెంట్ అయిందట. భర్త గౌతమ్ కు పిల్లలంటే చాలా ఇష్టమట. అందుకే నీల్ తర్వాత మరొక బిడ్డను కనాలని కాజల్ భావించిందట.
ఇక నీల్ కు ఏడాది నిండటంతో కాజల్ మళ్లీ గర్భం దాల్చిందని నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు, ఇక సినిమాలకు పులిస్టాప్ పెట్టిన భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని కాజల్ నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్ట్ లకు కూడా సైన్ చేయడం లేదని గుసగుసలు వినిపస్తున్నారు.