Kajal Aggarwal: ‘ఎన్బీకే 108’…. 40 నిమిషాల పాత్రకే కాజల్ కు అంతెలా ఇచ్చేశారు?

  • March 21, 2023 / 01:32 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎన్బీకే 108′(వర్కింగ్ టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి,హరీష్ పెద్ది బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ కాజల్ కూడా జాయిన్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో బాలయ్య అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొందనే చెప్పాలి. బాలయ్యతో కాజల్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అయితే బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ రావడం.. కాజల్ కు ఇది మొదటిసారి కాదు. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘లయన్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కాజల్ కు లభించింది. కానీ ఆ టైంలో ఈమె కాల్ షీట్లు ఖాళీ లేవని తప్పుకుంది. అటు తర్వాత ‘లెజెండ్’ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రాల్లో కూడా కాజల్ కు అవకాశం లభించింది.

కానీ ఆ సినిమాలను కూడా ఈమె రిజెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి – బాలకృష్ణ సినిమాలో నటించడానికి ఈమె ఓకే చెప్పింది. ఆమె ఈ ప్రాజెక్టుకి అంగీకరించడానికి కారణాలు ఉన్నాయి. మొదటిగా కాజల్.. ఫేడౌట్ అయిపోయే స్టేజిలో ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు పెద్ద ఆఫర్లు అయితే లేవు. రెండోది బాలయ్య సినిమా కోసం కాజల్ కు రూ.3 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారు. పైగా ఈ సినిమాలో కాజల్ పాత్ర నిడివి 40 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అందుకే ఆమె ఈ సినిమాలో నటించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus