Rakul Preet: ప్రభాస్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న రకుల్!

  • April 2, 2022 / 06:46 PM IST

టాలీవుడ్ అగ్ర హీరోల్లో దిల్ రాజు ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. హిట్టు మీద హిట్టు అందుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు. రీసెంట్ గా ఈ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ హీరోగా నిర్మించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకున్నారట.

Click Here To Watch NOW

కానీ ఆమెని తప్పించి కాజల్ ని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ‘బృందావనం’ సినిమా షూటింగ్ చేస్తోన్న సమయంలో ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమాను మొదలుపెట్టామని.. ముందుగా రకుల్ ని హీరోయిన్ గా తీసుకున్నామని చెప్పారు. ఆమెతో ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశామని చెప్పారు. ఆ రషెస్ చూసిన తరువాత తనకు తృప్తిగా అనిపించలేదని గుర్తుచేసుకున్నారు. ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమా హీరోయిన్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని ఉంటుందని.. రకుల్ చాలా సన్నగా ఉండేదని.. ఎందుకైనా మంచిదని షూటింగ్ ఆపేశామని చెప్పారు.

ప్రభాస్ కూడా ఇదే విషయం చెప్పానని.. మంచి హీరోయిన్ ఉండాలని టీమ్ తో డిస్కషన్ పెట్టినప్పుడు కాజల్ ని తీసుకోవాలనుకున్నామని అన్నారు. అదే విషయం ప్రభాస్ కి చెబితే అప్పటికే ఆమెతో ‘డార్లింగ్’ సినిమా చేస్తున్నానని అన్నాడని.. రెండు కథలు వేరని చెప్పి ఒప్పించమని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కాజల్ అప్పటికే తమ బ్యానర్ లో ‘బృందావనం’ సినిమా చేస్తుందని.. ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ స్టోరీ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేసిందని అన్నారు.

ఆ సమయంలో రకుల్ ని అలా పక్కన పెట్టడం బాధగా అనిపించిందని.. కానీ సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదని.. వ్యక్తుల కంటే సినిమా వర్కవుట్ అవ్వాలనే చూస్తానని తెలిపారు. అందుకే రకుల్ స్థానంలో కాజల్ ని తీసుకొని సినిమా చేశామని.. అటు ‘బృందావనం’ ఇటు ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ రెండూ సూపర్ హిట్స్ అయ్యాయని అన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus