Kajal: కాజల్ కి ఇలాంటి వింత జబ్బు ఉందా.. పాపం నటి!

  • October 20, 2023 / 07:58 PM IST

వెండి తెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. నటిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.

ఇప్పటికే కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమాలో కూడా నటించారు. బాలయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కాజల్ అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా బాధపడుతున్నటువంటి ఒక సమస్య గురించి కూడా బయట పెట్టారు. కాజల్ అగర్వాల్ కూడా అందరి మాదిరిగానే ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారట మరి ఈమె బాధపడుతున్నటువంటి ఆ వ్యాధి ఏంటి అనే విషయానికి వస్తే..

తాను (Kajal) అధికంగా ఫుడ్ తీసుకున్న ఎక్కువగా ఓవర్ వెయిట్ కారట. ఇలా తనకు ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకున్న శరీర బరువు పెరగను కానీ నాలుగు రోజులు మాత్రం జిమ్ కి వెళ్లకుండా మానేస్తే మాత్రం అధికంగా ఓవర్ వెయిట్ అవుతానని, ఇలా పెరిగిన బరువు తగ్గడానికి మరొక పది రోజులు పాటు కష్టపడాల్సి ఉంటుందని తెలిపారట. ఫుడ్ విషయంలో నేను నాకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూనే ప్రతిరోజు తప్పకుండా వర్కౌట్స్ చేస్తానని ఈమె తెలియజేశారు.

నచ్చిన ఫుడ్ తీసుకుంటూ వర్క్ అవుట్ చేసిన తాను ఎప్పటిలాగే ఫిట్ గా ఉంటాను కానీ రెండు రోజులు మాత్రం వర్కౌట్ చేయకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఇది కూడా ఒక జబ్బేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సెలబ్రిటీలకు ఫిట్నెస్ అనేది ఎంతో ముఖ్యమైనది కనుక ఈ విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారని చెప్పాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus