చిరుతో చెయ్యడానికి అంత డిమాండ్ చేసిందా??

టాలీవుడ్ మెగాస్టార్ గా నీరాజనాలు అందుకున్న చిరంజీవి అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసేసాడు. వరుస సినిమాలతో, సూపర్ డూపర్ హిట్స్ తో దుమ్ము దులిపేసాడు. అంతలో ఏమయిందో ఏమో తెలీదు కానీ, చిరు కరియర్ మంచి హిట్ ట్ర్యాక్ లో నడుస్తూ ఉండగానే రాజకీయాల్లోకి దూకేసి పెద్ద తప్పే చేశానని దాదాపుగా 10ఏళ్ల తరువాత తెలుసుకున్నాడు. మళ్ళీ తనా అభిమానులకు దగ్గర అవ్వాలి అన్న ఆలోచనతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు.

అదే క్రమంలో ఎన్నో కధలు విన్న చిరు చివరకు మంచి మెసేజ్ ఉండే సినిమా బావుంటుంది అని భావించి తమిళ సినిమా కత్తి ని రీమేక్ చెయ్యాలన్న ఆలోచనలో రెండేళ్ళు గడిపేశాడు. ఇక ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఇక సంగీతం రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇస్తున్నాడు..మరోపక్క నిర్మాతగా చిరు తనయుడు రాంచరణ్ వ్యవహరించబోతున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో చిరు సినిమాలో ఒక్క చాన్స్ వస్తే చాలు అనుకునే హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు చిరు పొసిషన్ చాలా రివర్స్ గా ఉంది….ఈ సినిమాలో చిరు సరసన నటించేందుకు అందరూ పోటీ పడతారు అనుకుంటే ఒక్కరూ కూడా ఒప్పుకోకపోగా, ఒక హీరోయిన్ అయితే చిరుని అవమానించినంత పనిచేసింది.

ఎవరా హీరోయిన్ అంటే…కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు చిరుతో చేస్తావా అనగానే…చిరంజీవి సీనియర్ హీరో అని భావించిందో ఏమో కానీ నో అని డైరెక్ట్ గా చెప్పకుండా, రెండున్నర కోట్లు ఇస్తే చేస్తా అని చెప్పి చిరంజీవి కి అలాగే ఆ చిత్ర బృందానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక విషయం గ్రహించిన మనవాళ్ళు వేరే భామ కోసం వేతుకుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus