Kajal: ఆ ఆతృతను అనుభవించానన్న కాజల్ అగర్వాల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మగబిడ్డకు నీల్ అనే పేరు పెట్టగా నీల్ అంటే తెలుగులో ఛాంపియన్ అని అర్థం. ప్రస్తుతం మాతృత్వపు మధురానుభూతులను ఆస్వాదిస్తున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాజల్ ఆ పోస్ట్ లో ఈ ప్రపంచంలోకి నా కొడుకు నీల్ ను ఆహ్వానించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

Click Here To Watch NOW

కొడుకుకు జన్మనివ్వడంతో తాను ఎంతగానో సంతోషిస్తున్నానని ఆమె తెలిపారు. తన కొడుకు తొలిసారి ఛాతీపై పడుకున్న క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె వెల్లడించారు. ఆ క్షణంలో తాను ప్రేమకు సంబంధించిన లోతైన భావనను పొందానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. లైఫ్ లాంగ్ తాను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నానని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. నిజానికి ఒక బిడ్డకు జన్మనివ్వడం తేలిక కాదని కాజల్ వెల్లడించారు. నేను మూడురోజుల పాటు నిద్రలేని రాత్రులను గడిపానని కాజల్ కామెంట్లు చేశారు.

కొడుకును ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా అనే ఆతృతను తాను అనుభవించానని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చని కచ్చితంగా అందంగా ఉంటారని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని నిశ్శబ్దంగా, ఆనందంగా సాగిస్తున్నామని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. తాను తన కొడుకు ఒకరికొకరం ఎదుగుతూ ఆవిష్కరించుకుంటున్నామని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కొడుకును హత్తుకోవడం, కొడుకు కళ్లలోకి ప్రేమగా చూడటం, కొడుకుతో ప్రతిరోజూ మధురమైన కౌగిలింతలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని ఆమె అన్నారు.

కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాజల్ మరికొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారు. కాజల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కాజల్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus