Kalaavathi Song: ‘సర్కారు వారి పాట’ లో ని ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ రిలీజ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో మహేష్ బాబుని చూపించబోతున్నారు.

Click Here To Watch

అయితే వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమాలో మొదటి సాంగ్ ని విడుదల చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన పోస్టర్స్, ప్రోమోలను విడుదల చేశారు. ఫిబ్రవరి 14న సాంగ్ వస్తుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్‌ను లీకువీరులు నాశనం చేశారు. రిలీజ్ కి ముందే సాంగ్ లీక్ అవ్వడంతో చిత్రబృందం షాకైంది. ప్రస్తుతం ఈ లీక్ సాంగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాధపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. తన గుండెపగిలిందని.. ఈ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డామని కానీ కొందరి కారణంగా సాంగ్ లీకైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేదేం లేక చెప్పిన సమయానికంటే ముందే ‘కళావతి’ సాంగ్ ను విడుదల చేసేసింది చిత్రబృందం. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.

ఇదొక మెలోడీ సాంగ్.. ఎంతో క్లాస్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచగా.. ఈ సాంగ్ మరింత ఆకట్టుకుంటుంది. మే 12న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. త్రివిక్రమ్, రాజమౌళి లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. ముందుగా త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus