నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. మారి అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. రావు రమేష్, మహేష్ ఆచంట వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.
‘భీమవరం బాల్మా’ అనే పాట ఆకట్టుకుంది. మిగిలిన పాటలకి పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. అయినప్పటికీ టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. సినిమాకి కావలసినంత బజ్ తీసుకొచ్చాయి. ఆల్రెడీ ఈ సినిమాని నాగవంశీ కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకి చూపించారు. వాళ్ళు సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
వాళ్ళ టాక్ ప్రకారం.. ‘అనగనగా ఒక రాజు’ సినిమా రన్ టైం 2 గంటల 30 నిమిషాలు ఉందట. గౌరపురం అనే ఊరు. అక్కడ జమిందార్ కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు. డబ్బుండానే పైత్యంతో అతను చేసే వింత పనులు ఊర్లో జనాలని ఇబ్బంది పెట్టడం. ఆ తర్వాత అతను ఓ అమ్మాయిని ప్రేమించడం. అదే టైంలో అతనికి ఓ సమస్య వచ్చి.. సాధారణ జీవితం గడపాల్సి రావడం. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది.
గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కిందట. అక్కడి యాసతో నవీన్ పోలిశెట్టి పలికిన డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయట. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉంటుందని… సెకండాఫ్ లో ఉన్న ఎమోషన్ కూడా అందరికీ కనెక్ట్ అవుతుందని అంటున్నారు. కచ్చితంగా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టే సినిమా ఇదే అవుతుందని.. బయ్యర్స్ అందరికీ భారీ లాభాలు రావడం ఖాయమని అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.