మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు అక్యుపెన్సీలు భారీగా పెరిగాయి. దాదాపు 70 శాతం పైనే ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ‘శంకర ప్రసాద్..’ దూకుడు ఓ రేంజ్లో ఉంది అని చెప్పాలి.
అక్కడ కూడా అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా మరో సీనియర్ హీరో బాలకృష్ణ రికార్డులు బ్రేక్ చేసింది అని చెప్పాలి.విషయంలోకి వెళితే.. తాజాగా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ‘అఖండ 2’ రికార్డుని బ్రేక్ చేసింది. ‘అఖండ 2’ సినిమా ఓవర్సీస్ లో ఫుల్ రన్లో 1 మిలియన్ డాలర్లకి కలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.9 కోట్లు. అయితే ఆ కలెక్షన్లను ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అధిగమించింది.
కేవలం ప్రీమియర్స్ తోనే ఈ సినిమా 1.2 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే రూ.11 కోట్లు అనమాట. ఫుల్ రన్లో ఈ సినిమా ఈజీగా 3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్లో అక్కడ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కామెడీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’కి ఈ రికార్డు సాధ్యమైంది అని చెప్పొచ్చు. ఓవర్సీస్ బయ్యర్స్ కి ఈ సినిమా భారీ లాభాలు పంచడం ఖాయంగానే కనిపిస్తుంది.