పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD ‘ (Kalki 2898 AD) ప్రమోషన్స్ ఈరోజు నుండి మొదలయ్యాయి. ఈ చిత్రంలో ‘బుజ్జి’ అనే కారు.. చాలా కీలకంగా ఉంటుందట. కాబట్టి.. దానికి సంబంధించిన 50 సెకన్ల ప్రోమో ఒకటి విడుదల చేయబోతున్నారు.రామోజీ ఫిలింసిటీలో చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. దాదాపు 5 ఎకరాల్లో ‘కల్కి’ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈవెంట్ కి వచ్చిన అభిమానులకి, మీడియా వారికి డిన్నర్ కూడా అరేంజ్ చేసినట్టు వినికిడి.
అందులో చాలా ఐటమ్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా ఈరోజు జరిగే ‘కల్కి’ వేడుకకి ఏకంగా రూ.4.5 కోట్లు ఖర్చు చేస్తున్నారట నిర్మాతలైన అశ్వినీదత్ (C. Aswani Dutt) , స్వప్న దత్ (Swapna Dutt) , ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లు..! తెలుగు సినిమా చరిత్రలోనే ఓ ఈవెంట్ కోసం ఇంత భారీగా ఖర్చు చేయడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. ఇక మరోపక్క ‘బుజ్జి’ అనే కారు కోసం కూడా రూ.7 కోట్లు ఖర్చు చేశారట. ఈ కారును స్వయంగా టీం తయారు చేయించుకున్నట్టు సమాచారం.
దీని స్పెషాలిటీ ఏంటంటే.. గాల్లో ఎగురుతూ ఉంటుందట. అది సినిమాలోనే..! హీరో వాహనం ఇది అని.. దీనికి కోసం కూడా ఎలివేషన్ సీన్లు ఉంటాయని సమాచారం. కీర్తి సురేష్ ఈ ‘బుజ్జి’ కోసం డబ్బింగ్ చెబుతున్న సంగతి కూడా తెలిసిందే. అలాగే ఈ కారుకి కూడా చిన్న మైథలాజికల్ కనెక్షన్ ఉంటుందట. అది సినిమాలోనే చూసి తెలుసుకోవాలని చిత్ర బృందం చెబుతోంది.ఇక జూన్ 27న ‘కల్కి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.