ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబో మూవీ కల్కి 2898 ఏడీకి క్రిటిక్స్ (Kalki 2898 AD) నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. రేటింగ్స్ సైతం అదుర్స్ అనేలా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న భారీ పాన్ ఇండియా సినిమా కల్కి 2898 ఏడీ మాత్రమే కావడం గమనార్హం. కల్కి సినిమాలో ప్రభాస్ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అనే డైలాగ్ చెబుతాడు. అదే విధంగా సినిమాలో గెలిచిన ప్రభాస్ ప్రేక్షకుల హృదయాలను సైతం గెలిచాడనే చెప్పాలి.
సినిమాలో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందని కామెంట్లు వినిపించినా ఎక్కువ సంఖ్యలో పాత్రలు ఉండటం, మూడు ప్రపంచాలకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో నాగ్ అశ్విన్ కథ, కథనం ప్రకారం పాత్రల నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కల్కి సినిమాకు సూపర్ రివ్యూలు రావడంతో రికార్డులు మాత్రమే బ్యాలెన్స్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
కల్కి 2898 ఏడీ సులువుగానే 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి బాహుబలి2 (Baahubali 2) కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచం ఇదే విధంగా ఉంటుందేమో అనే అభిప్రాయాన్ని కల్కి 2898 ఏడీ కలిగించిందని చెప్పవచ్చు. హాలీవుడ్ సినిమాలను మించేలా ఈ సినిమా ఉండబోతుందని ప్రచారం జరగగా ఆ ప్రచారమే నిజమైంది.
కల్కి 2898 ఏడీ సీక్వెల్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ (Keerthy Suresh) వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ సినిమాకు సంబంధించి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటనను ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ ఎన్ని అంచనాలు పెట్టుకుని వెళ్లినా ప్రేక్షకులను నిరాశ పరిచే అవకాశాలు అయితే ఉండవు.