సూపర్ హిట్ చిత్రాలని మిస్ చేసుకున్న కల్పిక..!

  • May 29, 2020 / 07:32 PM IST

‘ప్రయాణం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కల్పిక.. మొదటి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘ఆరెంజ్’ ‘జులాయి’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి కావడంతో ఆమెకు మరింత ఆదరణ దక్కింది. గతంలో కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు స్లిమ్ అయ్యి గ్లామర్ షో కూడా చేస్తుంది. ఈమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు బోల్డ్ పాత్రలను చెయ్యడానికి నేను రెడీ అన్నట్టు గ్లామర్ షో కూడా చేస్తుంది.

అయినా సరే ఇంకా ఈమెకు ఆశించిన స్థాయిలో ఎందుకు గుర్తింపు ఎందుకు రావడం లేదు అనే డౌట్ అందరిలోనూ ఉంది. దానికి కారణం.. కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఈమె వదులుకోవడం వల్లనే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా కల్పికనే చెప్పుకొచ్చింది. ఈమె మాట్లాడుతూ.. ” నేను నటించిన సినిమాల్లో ‘జులాయి’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్రాల్లో నాది చిన్న పాత్రే అయినా.. నాకు నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే ‘జులాయి’ చిత్రం తర్వాత నాకు ‘అఆ’ చిత్రంలో కూడా ఛాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్ గారు.

ఆ చిత్రంలో కీలకమైన నితిన్ చెల్లి పాత్ర చేసే ఆఫర్ మొదట నాకే వచ్చినప్పటికీ.. అప్పుడు వేరే సినిమా చేస్తుండడంతో రిజెక్ట్ చేశాను. అంతేకాదు ‘కేరాఫ్ కంచెర పాలెం’ సినిమాలో ముస్లిం అమ్మాయి పాత్ర చేసే అవకాశం కూడా మొదట నాకే వచ్చింది. ఆ సినిమాని కూడా రిజెక్ట్ చెయ్యాల్సి వచ్చింది. ఆ చిత్రాలు చేసి ఉంటే.. నా కెరీర్ మరోలా ఉండేదేమో’ అంటూ చెప్పుకొచ్చింది కల్పిక.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus