కళ్యాణ్ కృష్ణ.. కృష్ణ – ఈ వరుస చూస్తుంటే కిక్ సినిమా గుర్తొస్తోంది కదూ. ఇలియానా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ కృష్ణ (రవితేజ)తో బ్రేకప్ కారణంగా, పెళ్ళిచూపులకొచ్చిన శ్యామ్ పేరులో కళ్యాణ్ తీసేయమని అడుగుతుంది. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. ఇలాంటి పేర్లతోనే ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠికి ఓ సమస్య వచ్చిపడింది. కంగారు పడకండి.. ఇది బాయ్ ఫ్రెండ్స్ మేటర్ కాదు కెరీర్ మేటర్. వివరాల్లోకెళితే….
ఇటీవల నాగచైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్టు వార్తలు జోరుగా షికారు చేశాయి. ఇది కాస్త లావణ్య దృష్టికి వచ్చింది. దాంతో ఖంగుతిన్న ఉత్తరాఖండ్ సుందరి కళ్యాణ్ కృష్ణ నన్ను సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. అయితే నాగచైతన్యతో జోడీ కట్టనున్నది మాత్రం నిజమేనట. కృష్ణ ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. నాగచైతన్య మేనమామ, నిర్మాత సురేష్ బాబు చైతూతో ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు కథల కోసం అన్వేషిస్తున్నారు. అది ఇప్పటికి ఫలించిందట. అదన్నమాట అసలు విషయం..!