టాలెంటెడ్ యాక్టర్ కమ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే డిఫరెంట్ మూవీతో ఫిబ్రవరి 10న ప్రేక్షకాభిమానుల ముందుకు రాబోతున్నాడు. కెరీర్లో ఫస్ట్ టైమ్ ఆయన మూడు విభిన్నమైన పాత్రలలో త్రిపాత్రాభినయం చేశాడు. ‘బింబిసార’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడం, పైగా ట్రిపుల్ రోల్ చేయడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీతో ఆషిక రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది..
ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన చేతిమీద ఉన్న టాటూ వెనుకున్న సీక్రెట్ ఫస్ట్ టైం రివీల్ చేశాడు. తన భార్య స్వాతి పేరుని ఎందుకు పచ్చబొట్టువేయించుకోవాల్సి వచ్చిందనేది వివరంగా చెప్పాడాయన.‘‘2007 – 2008 మధ్య నేను అనారోగ్యానికి గురయ్యాను.. ఆ సమయంలో భార్యలందరూ భర్తల పట్ల కేర్ తీసుకుంటారు.
కొందరు నర్సలను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు. కానీ నా విషయానికొస్తే.. నర్సులు కూడా వద్దని తనే దగ్గరుండి చూసుకుంది. స్వాతికి నా గురించి అంతా తెలుసు.. తల్లి తన బిడ్డని ఎలా చూసుకుంటుందో నన్ను అలా చూసుకుంటుంది. తన కేరింగ్ నా మనసుకి దగ్గరైంది. మా 10వ పెళ్లి రోజు నాడు ‘నీకేం కావాలో చెప్పు’ అన్నాను.. ‘నాకేం వద్దు.. మీరు, పిల్లలున్నారు.. చాలు అంది’.. అప్పుడు నాకు తన పేరు టాటూ వేయించుకోవాలనిపించింది.
నాకు ఇంజక్షన్ అంటేనే భయం.. అయినా తన మీద ఉన్న ఇష్టంతో స్వాతి పేరుని టాటూ వేయించుకున్నా.. తను లేకపోతే నేను లేను’’ అంటూ భావోద్వేగానికి గురవుతూ చెప్పాడు కళ్యాణ్ రామ్. ‘‘భార్య పట్ల అతను చూపించే ప్రేమాభిమానాలకు హ్యాట్సాఫ్’’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!