Kalyan Ram: ‘బింబిసార’ కోసం కళ్యాణ్ రామ్ హార్డ్ వర్క్ చూశారా?

కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘బింబిసార’. కళ్యాణ్ రామ్ కెరీర్లో భారీ బడ్జెట్ మూవీగా ‘బింబిసార’ తెరకెక్కింది. ఈ చిత్రం కోసం సుమారు రూ.45 కోట్లు ఖర్చుపెట్టారట. విడుదల చేసిన రెండు ట్రైలర్లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. పాటలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ సినిమాకి కావాల్సిన హైప్ అంతా ట్రైలర్లు రాబట్టేశాయి. ఇక ఈ చిత్రం ప్రమోషన్లను ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నారు హీరో కళ్యాణ్ రామ్ అండ్ టీం.

ఇందులో భాగంగా తన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై ‘అప్ క్లోజ్ విత్ ఎన్ కే ఆర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇందులో ‘బింబిసార’ జర్నీ గురించి తెలియజేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం ఏకంగా 13 కేజీలు తగ్గినట్టు తెలిపి అందరికీ షాకిచ్చాడు. ‘ఎంతమంచి వాడవురా’ సినిమా టైంలో తన బరువు 88 కేజీలుగా ఉండేదట. ‘బింబిసార’ కోసం చాలా వర్కౌట్లు చేసి 75 కేజీలకు వచ్చాడట.కళ్యాణ్ రామ్ ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలాగే పనిలో పనిగా ఈ చిత్రం కథ ఏంటన్నది కూడా కళ్యాణ్ రామ్ రివీల్ చేసేశాడు. ఓ క్రూరమైన రాజు.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి టైం ట్రావెల్ అయ్యి ప్రస్తుత కాలానికి వచ్చి .. అతను ఏ విధంగా ప్రవర్తించాడు..! మంచిగా ఎలా మారాడు..! తన రాజ్యంలో ఎలా ప్రవర్తించాలని తెలుసుకున్నాడు అనేది మెయిన్ పాయింట్ అంటూ కళ్యాణ్ రామ్ తెలియజేసాడు. కళ్యాణ్ రామ్ అన్ని విధాలుగా ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. మరి రిజల్ట్ ఏమవుతుందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus