నందమూరి హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నందమూరి కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. గత ఏడాది కళ్యాణ్ రామ్ నటించిన `బింబిసార` ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత `అమిగోస్` తో పలకరించినా.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం `డెవిల్`అనే మూవీతో బిజీగా ఉన్నాడు. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్.. అనేది ట్యాగ్ లైన్. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన భార్య పేరు స్వాతి. ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
కళ్యాణ్ రామ్, స్వాతిలది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి చూపుల్లోనే స్వాతి బాగా నచ్చడంతో.. కళ్యాణ్ రామ్ ఆమెతో ఏడడుగులు వేశాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. స్వాతి ఉన్నత కుటుంబంలో జన్మించింది. వృత్తిపరంగా ఆమె ఒక డాక్టర్. అయితే నందమూరి ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత స్వాతి తన వృతిని వదిలి పెట్టి.. సంపూర్ణ గృహిణిగా మారింది. స్వాతి గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..
టాలీవుడ్ కు చెందిన హీరోల్లో తన భర్త కంటే అక్కినేని నాగార్జున అంటేనే ఎక్కువ ఇష్టమట. నాగార్జునకు స్వాతి విరాభిమాని అట. నాగార్జున నటించిన మన్మథుడు సినిమా ఎన్ని సార్లు చూసిందో ఆమెకే తెలియద. ఇక చదువుకునే రోజుల్లోనే నాగార్జున సినిమా రిలీజ్ అవుతుందంటే.. కాలేజీకి డుమ్మా కొట్టి మరీ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్లాదట.