కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన డెవిల్ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. 2 గంటల 26 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతోంది. మల్టీప్లెక్స్ లలో డెవిల్ బుకింగ్స్ బాగానే ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన డెవిల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
డెవిల్ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు బుకింగ్స్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి డెవిల్ షోలు హైదరాబాద్ లో ప్రదర్శితం అవుతున్నాయి. డెవిల్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోయినా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆదివారం రోజున ఈవెంట్ ను నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివరి హిట్ గా డెవిల్ నిలిచే అవకాశం అయితే ఉందని నందమూరి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
సలార్ విడుదలై వారం కావడంతో డెవిల్ (Devil) సినిమాకు భారీ స్థాయిలోనే థియేటర్లు దక్కాయి. డెవిల్ కు పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి పండుగ వరకు ఈ సినిమాకు ఈ సినిమాకు తిరుగుండదని చెప్పవచ్చు. డెవిల్ సినిమా ప్రమోషన్స్ కోసం కళ్యాణ్ రామ్ ఎంతో కష్టపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో పాల్గొనడం లేదు.
ఎంతో క్రేజ్ ఉన్న టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు. బుకింగ్స్ నెమ్మదిగా పుంజుకుంటుండగా ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది. డెవిల్ మూవీ రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. కళ్యాణ్ రామ్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. నందమూరి మల్టీస్టారర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.