విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమా ద్వారా మలయాళ సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా పరిచయమయింది. అక్కినేని ప్రిన్స్ అఖిల్ కి సరైన జోడీగా అభినందనలు అందుకుంది. ఈమె తొలి చిత్రంతోనే తెలుగువారి మనసును దోచుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా మల్లూవుడ్ నుంచి నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెబుతున్నప్పటికీ వచ్చిన అవకాశాలకు ఒకే చెప్పడం లేదు. కథతో పాటు అందులో తన పాత్రకి ప్రాముఖ్యత ఉంటేనే సైన్ చేస్తానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
స్వామి రారా ,కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి కళ్యాణి అంగీకరించినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. స్టార్ హీరోల సినిమాలను వదులుకున్న ఈ బ్యూటీ హీరో శర్వానంద్‌కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కథ, క్యారెక్టర్ నచ్చడం వల్లే కళ్యాణి ఓకే చెప్పినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.