‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) వస్తుంది అని చెప్పినప్పుగా.. ఇన్నాళ్లకు మళ్లీ వస్తున్నారా అని అనుకున్నారంతా. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమాల ఆలస్యమైంది. ఆ తర్వాత ఉందో, లేదో అనే డౌట్ కూడా క్రియేట్ అయ్యింది. అనూహ్యంగా ‘విక్రమ్’ సినిమా తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan) ముందుకు రావడం, శంకర్‌ను (Shankar) ఒప్పించడంతో ‘భారతీయుడు 2’ పట్టాలెక్కింది. ఇప్పుడు రిలీజ్‌కి దగ్గరగా వస్తోంది. అయితే, ఇటీవల సినిమా టీమ్ చెప్పినట్లుగా మూడో ‘భారతీయుడు’ కూడా ఉన్నాడు.
రెండో ‘భారతీయుడు’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వచ్చిన ఆలోచనతోనే ‘ఇండియన్ 3’ సినిమా ఓకే చేసి షూటింగ్ కూడా చేసేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసి త్వరలో ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు కమల్ చేసిన ఓ కామెంట్ వైరల్‌గా మారింది. అది సేనాపతి గురించి కావడం గమనార్హం. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’.
ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కొందరేమో కథ ఏకంగా చెప్పేస్తున్నారు. వాటి మీద ‘మీరు చెప్పేదంతా నిజం కాదని, మీరెవరూ కథను ఊహించలేదు’ అని కమల్ ఓ కామెంట్ చేశారు. దీంతో ఊహించని ఆ కథ ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే మూడో ‘భారతీయుడు’కి క్రేజ్ పెరిగే కామెంట్ కూడా వచ్చింది. ‘ఇండియన్ 3’లో సేనాపతి తండ్రి పాత్ర కూడా ఉంటుంది అని కమల్ హాసన్ చెప్పారు.
దీంతో సేనాపతే ఇలా ఉంటే.. ఇక అతని తండ్రి ఇంకెలా ఉంటారు అంటూ అంచనాలు వేయడం ప్రారంభించారు. అయితే ‘భారతీయుడు 3’ అనేది మొత్తంగా ఈ సిరీస్ సినిమాలకు ప్రీక్వెల్ అవ్వొచ్చనే చర్చ కూడా సాగుతోంది. చూద్దాం మరి శంకర్ మైండ్‌లో ఏముందో? ఎలాంటి ఆలోచన చేశారో. రెండో ‘భారతీయుడు’ ఫలితం మీదే మూడో ‘ఇండియన్’ రిలీజ్ డేట్ ఉంటుంది అని చెప్పాలి.