వైరల్ అవుతున్న కమల్ ఆర్ ఖాన్ కొడుకు ట్వీట్!

  • September 12, 2022 / 02:56 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న క్రిటిక్స్ లో కమల్ ఆర్ ఖాన్ ఒకరు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద పోస్ట్ ల ద్వారా కమల్ ఆర్ ఖాన్ వార్తల్లో నిలిచారు. 2020 సంవత్సరంలో దివంగత బాలీవుడ్ నటులైన రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ గురించి కేఆర్కే వివాదాస్పద ట్వీట్లు చేయగా ఆ ట్వీట్ల విషయంలో కేఆర్కేపై కేసు నమోదైంది. గత నెల 29వ తేదీన కేఆర్కేను ముంబై థానే పోలీసులు అరెస్ట్ చేశారు.

తొమ్మిది రోజులు జైలు జీవితం గడిపిన కేఆర్కే తాజాగా బెయిల్ పై విడుదలై ముంబైలో నివాసం ఉంటున్నారు. కేఆర్కే కొడుకు ఫైసల్ కమాల్ కొంతమంది నుంచి కేఆర్కేకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ట్విట్టర్ ఖాతా ద్వారా ఫైసల్ కమాల్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫైసల్ కమాల్ ఆ ట్వీట్ లో నేను కేఆర్కే కుమారుడినని నా వయస్సు 23 సంవత్సరాలు అని పేర్కొన్నారు,

నేను ప్రస్తుతం లండన్ లో ఉంటున్నానని కొందరు వ్యక్తులు మా నాన్నను హింసిస్తున్నారని కేఆర్కే కొడుకు చెప్పుకొచ్చారు. వాళ్లు ఆయనను చంపే అవకాశం ఉందని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లా మా నాన్న చనిపోవాలని మేము కోరుకోవట్లేదని ఫైసల్ కమాల్ అన్నారు. నాన్నే మా కుటుంబానికి ఆధారం అని దయచేసి నాన్నకు కాపాడాలని ఫైసల్ కమాల్ తెలిపారు. ప్రజలంతా మా నాన్నకు మద్దతు ఇవ్వాలని ఫైసల్ కమాల్ కోరారు.

ఫైసల్ కమాల్ వి స్టాండ్ విత్ కేఆర్కే అనే హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసి తన తండ్రికి మద్దతు ఇవ్వాలని కోరారు. కేఆర్కే బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలపై కూడా గతంలో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేఆర్కే పలు సినిమాలలో నటించి ఆ సినిమాల ద్వారా నటుడిగా కూడా గుర్తింపును సంపాదించుకున్నారు. కేఆర్కే కొడుకు ట్వీట్ కు నెటిజన్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus