ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఆడియెన్స్ సైతం రెగ్యులర్ ఫార్మాట్ కంటే ఏదైనా కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో ఓ సినిమాను నిర్మిస్తోంది. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్ మీద లక్ష్మీ నిర్మాత ప్రొడక్షన్ నెంబర్ వన్ రాబోతోంది. ఈ చిత్రానికి శివ ప్రసాద్ సహ నిర్మాత. ఈ మూవీని పి. చలపతి కుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను సినిమా ఆఫీస్‌లో నిర్వహించారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందాన్ని ప్రకటించనున్నారు. అటుపై గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి మహవీర్ సంగీత దర్శకుడు. పి. శ్రీనివాస్, హరీష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లుగా నిర్వర్తించనున్నారు.