Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ
- June 27, 2026 / 07:37 PM ISTByPhani Kumar
సినిమా వాళ్ళు రాజకీయ కుటుంబాలకి చెందిన వారితో సంబంధాలు కలుపుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా ఓ హీరోయిన్ మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె మరెవరో కాదు త్రివేణీ రావ్(Thrriveni). కన్నడలో ‘టగరు’ అనే బ్లాక్ బస్టర్ సినిమాలో ఈమె ‘కానిస్టేబుల్ సరోజ’ పాత్రతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ‘బాహుబలి’ సినిమాలో హీరోయిన్ అనుష్కకి డూప్ గా కూడా చేసింది త్రివేణీ రావ్.
Thrriveni

అలాగే ఆ సినిమా చిన్న పాత్రలో కూడా కనిపించింది.అటు తర్వాత రుషికా రాజ్ గా పేరు మార్చుకుని ‘అల్లే డ్రా అల్లే బహుమాన’ ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ జమాళిగుడ్డ’ ‘రామ మార్తాండ’ వంటి కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. చాలా సైలెంట్ గా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అయినటువంటి బిప్లబ్ కుమార్ దేవ్‌ను పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ అయ్యింది. ఈ వేడుకతో తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది అనే చెప్పాలి.
జూన్ 19న న్యూఢిల్లీలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలను త్రివేణీ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. నూతన దంపతులకి నెటిజెన్లు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.
ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి













