Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ‘కన్నప్ప'(Kannappa). జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పర్వాలేదు అనిపించాయి. అయితే వీక్ డేస్ లో చాలా వరకు తగ్గాయి. అయినా ఓవర్ ఆల్ గా మంచు విష్ణు కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది ‘కన్నప్ప’. ప్రభాస్ (Prabhs) కామియో కూడా ఇందుకు హెల్ప్ అయ్యింది అని చెప్పుకోవచ్చు.

Kannappa Collections

అయితే సినిమాకు పెట్టిన బడ్జెట్ కి ఈ కలెక్షన్స్ తక్కువే అని కూడా చెప్పాలి. ఒకసారి ‘కన్నప్ప’ ‘(Kannappa) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 6.80 cr
సీడెడ్ 2.23 cr
ఉత్తరాంధ్ర 2.13 cr
ఈస్ట్ 1.16 cr
వెస్ట్ 0.84 cr
గుంటూరు 0.92 cr
కృష్ణా 0.81 cr
నెల్లూరు 0.75 cr
ఏపీ+తెలంగాణ 15.64 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.32 cr
ఓవర్సీస్ 2.50 cr
వరల్డ్ టోటల్ 22.46 cr (షేర్)

‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.22.46 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.40.7 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.64.54 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంత టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఇక కష్టమే.

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus