Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

మంచు విష్ణు (Vishnu Manchu) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా జూన్ 27న విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం వల్ల.. అంచనాలు ఏర్పడ్డాయి. సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యుఎ రేటింగ్ పొందింది. మొదట 3 గంటల 15 నిమిషాల రన్ టైం వచ్చిందని.. మళ్ళీ ట్రిమ్ చేసి సెన్సార్ వారికి ఇచ్చింది చిత్ర బృందం. దీంతో ఫైనల్ గా 3 గంటల 2 నిమిషాల 51 సెకన్ల నిడివి వచ్చినట్టు సమాచారం. ఇక సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సన్నివేశాలను గమనిస్తే :

Kannappa

1)రాబందు చిన్న పిల్లాడిని కిందికి విడిచిపెట్టే సీన్ ఒకటి ఉంటుందట. ఆ విజువల్ ని డిలీట్ చేశారట.

2)తిన్నడు టెంకణని చంపి కోపంతో చూసే సీన్ ని డిలీట్ చేశారట.

3)గూడెం నాయకుల ఇంట్రో సాంగ్ ని దాదాపు 3 నిమిషాల పైనే డిలీట్ చేశారట.


4)తిన్నడు ఇంట్రో సాంగ్ ని కూడా నిమిషం పైనే కట్ చేశారట.

5)కాలముఖుడు కోపంతో కత్తికి ఉన్న రక్తాన్ని ముఖానికి తుడుచుకునే సీన్ ను డిలీట్ చేశారట.

6)తిన్నడు నెమలి వాటర్ తో ఫార్మ్ అయ్యి డాన్స్ చేసే విజువల్ ను 39 సెకన్ల పాటు కట్ చేశారట

7)సగమై చెరిసగమై పాటని 30 సెకన్ల పాటు కట్ చేశారట.

8)కాలముఖుడు సైన్యం గూడెం జనాలతో యుద్ధం చేసే ఎపిసోడ్ 38 సెకన్ల పాటు కట్ చేశారట

9)జటావి గలజ్జల డైలాగ్ వచ్చే సీన్ ను 5 నిమిషాల పైనే కట్ చేశారట

10)నెమలి తన వాళ్ళని విడిచిపెట్టి వెళ్లడం

ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus