Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. ఇప్పటికీ డీసెంట్ కానీ!

రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివోషనల్ అండ్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘కాంతార’. 2022 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ దసరాకి ‘కాంతార’ కి ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడం జరిగింది. ‘కాంతార చాప్టర్ 1’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కానీ భారీ స్థాయిలో అయితే కాదు అనే చెప్పాలి. ‘కాంతార’ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు.

Kantara Chapter 1 Collections

ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో బయ్యర్స్ భారీ రేట్లు పెట్టి.. థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు. అందువల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కష్టపడుతుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ అనిపించేలా కలెక్ట్ చేస్తుంది కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువగా ఉండటం వల్ల అవి సరిపోయే విధంగా లేవు అని చెప్పాలి.

ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 13 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 27.91 cr
సీడెడ్ 8.83 cr
ఉత్తరాంధ్ర 8.12 cr
ఈస్ట్ 3.41 cr
వెస్ట్ 2.50 cr
గుంటూరు 3.72 cr
కృష్ణా 3.79 cr
నెల్లూరు 1.89 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 60.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.42 cr
టోటల్ వరల్డ్ వైడ్ 61.59 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)

‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.61.59 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.109.8 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.24.41 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పటికీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు అయితే కనిపించడం లేదు.

‘ఓజి’ కలెక్షన్స్ పై ఓటీటీ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడిందా ..?

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus