రిషబ్ శెట్టి (Rishab Shetty) ‘కాంతార’ తో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అతను డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఆ సినిమా కన్నడలో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.హిందీలో కూడా భారీ వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో ‘కాంతార’ ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.మరీ ‘కాంతార’ని మ్యాచ్ చేయకపోయినా.. సినిమా బాగుందని విమర్శకులు, విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
దీంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. దసరా హాలిడేస్ కూడా బాగా కలిసొచ్చాయి అని చెప్పాలి. వీక్ డేస్ లో కొంత డ్రాప్ అయినప్పటికీ బాగానే రాణిస్తుంది. ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 20.01 cr |
సీడెడ్ | 7.28 cr |
ఉత్తరాంధ్ర | 6.44 cr |
ఈస్ట్ | 2.73 cr |
వెస్ట్ | 1.92 cr |
గుంటూరు | 3.10 cr |
కృష్ణా | 3.17 cr |
నెల్లూరు | 1.45 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 46.10 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.85 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 46.95 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్) |
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.46.95 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.78 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.39.05 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసింది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయడం వల్ల.. ఇప్పటికి సగం టార్గెట్ మాత్రమే రీచ్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ కోసం వీక్ డేస్ ఇలానే కలెక్ట్ చేసి.. వీకెండ్ మళ్ళీ పుంజుకుంటే ఎక్కువ శాతం రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది.