Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం వహించిన ‘కాంతార’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా భారీ వసూళ్లు సాధించి బయ్యర్స్ కి లాభాలు పంచింది. దీంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ గా రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ పై హైప్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ విడుదల చేస్తుంది.

Kantara Chapter 1 

అందువల్ల థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను ఒక లుక్కేద్దాం రండి :

నైజాం 32 cr
సీడెడ్ 8 cr
ఉత్తరాంధ్ర 10 cr
ఈస్ట్ 5 cr
వెస్ట్ 4 cr
గుంటూరు 8 cr
కృష్ణా 9 cr
నెల్లూరు 4 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
5 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 85 cr

‘కాంతార చాప్టర్ 1’ చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చాలా పెద్దది. ‘ఓజి’ వంటి పెద్ద సినిమా పోటీలో నెట్టుకు రావాలంటే స్ట్రాంగ్ పాజిటివ్ మౌత్ టాక్ కావాలి. లేదు అంటే ఇంత భారీ టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం అనే చెప్పాలి

కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus