కరీనా-సైఫ్ లకు విషెస్ చెబుతోన్న ఫ్యాన్స్!

  • February 22, 2021 / 07:45 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఆదివారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో కరీనా కపూర్ ని జాయిన్ చేయగా.. ఆదివారం నాడు ఆమె మగపిల్లాడికి జన్మనిచ్చింది. కాగా గతేడాది ఆగస్టు 12న కరీనా తను గర్భవతి అనే విషయాన్ని అభిమానులకు వెల్లడించింది. ఆ సమయంలో రెండో బిడ్డ రాకకోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు సంతోషంగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో అభిమానులంతా సైఫ్-కరీనా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కరీనా ఫ్యామిలీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృతా సింగ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సంతానం. ఆ తరువాత అమృతాతో విడిపోయిన సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి 2016లో డిసెంబర్ లో తైమూర్ పుట్టాడు. సుమారు ఐదేళ్ల క్రితం ఇప్పుడు తైమూర్ కి తమ్ముడు పుట్టాడు. రీసెంట్ గా కరీనా ‘లాల్ సింగ్ చద్దా’, ‘తాఖత్’ అనే సినిమాల్లో నటించింది. ఇప్పుడు కొన్నాళ్ల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనుంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus