Prabhas,Kareena: ప్రభాస్ సినిమాలో నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు.. క్లారిటీ ఇచ్చిన కరీనా!

  • September 8, 2022 / 01:20 PM IST

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ తాజాగా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన రాదే శ్యామ్ బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ఇక ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమా అనంతరం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమా చేయనున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ పెంచుకోవడం కోసం దాదాపు ఈయన సినిమాలలో బాలీవుడ్ నటీమణులను హీరోయిన్లుగా తీసుకుంటున్నారు. ఇప్పటికే సాహో, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలలో బాలీవుడ్ నటిమనులు సందడి చేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.

ఈ సినిమా అనంతరం ఈయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాలో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి కరీనాకపూర్ నటిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా పెద్ద ఎత్తున ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన కత్రినా కైఫ్ ప్రభాస్ స్పిరిట్ సినిమాపై స్పందించారు.

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఆఫర్ వచ్చిందా అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నాకు ప్రభాస్ సినిమాలో ఏ విధమైనటువంటి ఆఫర్ లేదని, నేను స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాననీ వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈమె స్పిరిట్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈ విషయంపై కరీనాకపూర్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె ఈ సినిమాలో నటించలేదని తెలిసినప్పటికీ కరీనాకపూర్ కాకపోయినా మరొక బాలీవుడ్ హీరోయిన్ ని ఈ సినిమాలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus