Jr NTR, Rajinikanth: రజినీ కాంత్, జూనియర్ ఎన్టీఆర్‌లను సత్కరించిన కర్ణాటక సీఎం..

అతిథి దేవో భవ అన్నారు మన పెద్దలు.. అతిథులను ఆదరించి, వారిని గౌరవించడం అనేది మన సంసృతి.. సాంప్రదాయం కూడా..స్వయంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే వచ్చి అతిథులను సత్కరించారంటే అది వారి సంస్కారానికి నిదర్శనం.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తమ ఆహ్వానాన్ని మన్నించి అతిథులుగా విచ్చేసిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను మర్యాద పూర్వకంగా సత్కరించిన ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్ కుమార్ తనయుడు, ‘కరుణాడ చక్రవర్తి’ డా, శివ రాజ్ కుమార్ సోదరుడు, కన్నడ ‘పవర్ స్టార్‘ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ ప్రధమ వర్థంతి సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్‌కు రజినీ, తారక్‌ల చేతుల మీదుగా అందించారు. గౌరవ అతిథులుగా హాజరైన రజినీ, జూనియర్‌లను పువ్వుల్లో పెట్టి చూసుకుంది అక్కడి ప్రభుత్వం.. పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ కూడా వారికి అన్ని మర్యాదలూ చేశారు..

రజినీ, తారక్, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తారక్ కుర్చీలు శుభ్రం చేసి మరీ అశ్విని, సుధామూర్తులను కూర్చోబెట్టడం విశేషం. ఇక కన్నడలో ఇచ్చిన స్పీచ్‌లో క్లుప్తంగా పునీత్ రాజ్ కుమార్ గురించి గొప్పగా, ఎమోషనల్‌గా మాట్లాడి అందరి మనసుల్నీ దోచేశాడు జూనియర్..ఆహ్వానించి హడావిడిలో మర్చిపోవడం కాకుండా దగ్గరుండి అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న సీఎం బసవరాజ్‌ని అందరూ అభినందిస్తున్నారు..

‘‘ప్రజల హృదయాలను గెలుచుకున్న రాజు పునీత్ రాజ్ కుమార్.. కర్ణాటకలో బ్యూటిఫుల్ సూపర్ స్టార్, గొప్ప కొడుకు, గొప్ప తండ్రి, గొప్ప ఫ్రెండ్.. గ్రేట్ యాక్టర్, డ్యాన్సర్, సింగర్.. వీటన్నిటికి మించి గొప్ప మానవతావాది.. నా ఉద్దేశంలో కర్ణాటక రత్న అంటే అర్థమే శ్రీ పునీత్ రాజ్ కుమార్’’ అంటూ తారక్ ఎమోషనల్‌గా ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంటోంది..భావం అర్థం కావడానికి భాషతో పనిలేదని, ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు పునీత్ రాజ్ కుమార్‌కి నివాళులర్పిస్తున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus