Karthi: ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తి ఫన్నీ కామెంట్స్..!

  • October 20, 2022 / 12:18 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుంది. అభిమన్యుడు ఫేమ్ పి ఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ప్రిన్స్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది . రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లు. ఈ చిత్రం ద్వారా 16 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.

ఇందులో హీరో కార్తీ ఫన్నీ స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. అతను మాట్లాడుతూ.. ” ‘యుగానికి ఒక్కడు’ సినిమాలో ఓ డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. అదే ‘ఎవర్రా మీరంతా’ అనే డైలాగ్. నేను కూడా ఇప్పుడు అదే అనబోతున్నా.. ‘ఎవర్రా మీరంతా’ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ ప్రేమకు నా కృతజ్ఞతలు. నాగార్జున అన్నయ్య ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది. అలాగే ‘సర్దార్’ ని నాగార్జున గారు తెలుగులో విడుదల చేయడం కూడా చాలా థ్రిల్ గా ఉంది.ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది.

‘మంచి నటుడు అవ్వాలంటే ముందు మంచి హ్యూమన్ బీయింగ్ అయ్యి ఉండాలి’ అని ఆయన చెబుతూ ఉంటారు. ఆయన చెప్పిన ఆ మాటే నాకు స్ఫూర్తి. నాకు తెలిసి నాగార్జున గారు చేసినన్ని రిస్కీ ప్రాజెక్టులు ఇంకెవ్వరూ చేయలేదు. ఏమీ ఆశించకుండా మంచి సినిమా ఇవ్వాలి అనే తపనతో పని చేస్తుంటారు. ఇక సర్దార్ నాకు చాలా స్పెషల్ మూవీ.ఈ సినిమా చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది అలాగే స్పై ఉంటుంది. స్పై అనగానే ఇందులో డాన్, అమ్మాయిలు, బికినీ లు ఉండవు.

అభిమన్యుడు తీసిన పి ఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. రాశి ఖన్నా, రజీషా, లైలా అద్భుతంగా నటించారు. జార్జ్ కెమరా పనితనం బ్రిలియంట్ గా ఉంటుంది. జీవీ ప్రకాష్ కుమార్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ‘ఖైదీ’ సినిమా దీపావళికి రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సర్దార్ కూడా దీపావళి కే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. ఇక అన్నయ్య.. గోవా లో షూటింగ్ చేసుకుంటున్నారు. రోలెక్స్(నవ్వుతూ) ప్రస్తుతం అక్కడే ఉన్నారు” అంటూ కార్తీ ఫన్నీగా స్పీచ్ ఇచ్చాడు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus