అన్నయ్యనే ఫాలో అవుతున్న తమ్ముడు..!

కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య కు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అతని సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతీ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తుంటారు అక్కడి దర్శకనిర్మాతలు. ‘గజిని’ ‘యముడు’ ‘సెవెంత్ సెన్స్’ ‘సింగం’ ’24’ ‘గ్యాంగ్’ వంటి చిత్రాలు.. తెలుగులో కూడా హిట్ అయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలు వరుసగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి.

‘ఎన్జీకే’ ‘బందోబస్తు’ వంటి చిత్రాలు బాగా ఆడలేదు. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తరుణంలో సూర్య.. తన ఆశలన్నీ రాబోయే ‘సూరారై పొట్రు’ ( తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రం పైనే పెట్టుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం ఓటిటిలోనే విడుదల కాబోతుంది. అక్టోబర్ 30న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో సూర్య మరియు అతని అభిమానులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యకూడదు అని డిస్ట్రిబ్యూటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. సూర్య వెనకడుగు వెయ్యడం లేదు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు సూర్య బాటలోనే అతని తమ్ముడు కార్తీ కూడా ఓటిటి బాట పడుతుండడం విశేషం. కార్తీ హీరోగా నటించిన ‘సుల్తాన్’ చిత్రం ఈ మధ్యే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట .మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus