Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా 2014 లో ‘కార్తికేయ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. చందూ మొండేటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ ని రూపొందించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమా రిలీజ్ కోసం ఆ టైంలో హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి.

Karthikeya 2 Collections

ఫైనల్ గా అన్ని ఒడిదుడుకులను అధిగమించి 2022 ఆగస్టు 13న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ వసూళ్లు సాధించింది. ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాని కూడా అక్కడ డామినేట్ చేసిన చరిత్ర ‘కార్తికేయ 2’ సొంతం. ఒకసారి ‘కార్తికేయ 2’ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 13.18 cr
సీడెడ్ 5.01 cr
ఉత్తరాంధ్ర 4.51 cr
ఈస్ట్ 2.61 cr
వెస్ట్ 1.68 cr
గుంటూరు 2.78 cr
కృష్ణా 2.26 cr
నెల్లూరు 1.10 cr
ఏపీ+తెలంగాణ 33.13 cr
హిందీ 15.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.92 cr
ఓవర్సీస్ 6.55 cr
వరల్డ్ టోటల్ 58.10 cr (షేర్)

 

‘కార్తికేయ 2’ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.58.10 కోట్ల షేర్ ను రాబట్టి రూ.40.10 కోట్ల లాభాలను బయ్యర్స్ కు మిగిల్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.హిందీలో ఈ సినిమా రూ.25 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. .

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus